గుండెపోటుతో 16 ఏళ్ల బాలుడు మృతి

76చూసినవారు
గుండెపోటుతో 16 ఏళ్ల బాలుడు మృతి
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం నికాల్‌పూర్ గ్రామంలో 16ఏళ్ల వడ్ల శివ అకస్మాత్తుగా మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఉదయం నిద్రలేచి క్షణాల్లోనే కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల పదో తరగతిలో A గ్రేడ్ సాధించిన శివ అకాలమరణంతో తల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్