కూలిన విమానంలో 169 మంది భారతీయులు.. 53 మంది బ్రిటన్‌ పౌరులు

71చూసినవారు
కూలిన విమానంలో 169 మంది భారతీయులు.. 53 మంది బ్రిటన్‌ పౌరులు
అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా ఏఐ-171 విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ పౌరులు, ఏడుగురు పోర్చుగల్‌ పౌరులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు, ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం అందించడానికి  1800 5691 444 అనే ప్రత్యేక ప్రయాణీకుల హాట్‌లైన్ నంబర్‌ను ఎయిర్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్