17 ఏళ్ల గిరిజన బాలికపై 10 మంది అత్యాచారం

83చూసినవారు
17 ఏళ్ల గిరిజన బాలికపై 10 మంది అత్యాచారం
జార్ఖండ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గొడ్డా జిల్లా సుందర్ పహారి పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల గిరిజన బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఓ పెళ్లికి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికెళ్ళినప్పుడు బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్