శుక్రవారం రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు రూ.2 లక్షలు జమ అవుతాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వైరా సభలో ఆయన చెప్పారు. కాగా, మూడో విడతలో 14.4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటికే 2 విడతల్లో రూ.లక్షన్నర వరకు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ రూ.1.50 నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కానుంది.