కేంద్ర ప్రభుత్వ 'MNREGA పశువుల షెడ్ పథకం' ద్వారా రైతులు భారీగా లబ్ది పొందొచ్చు. ఈ పథకంలో భాగంగా పాడి రైతులు పశువుల షెడ్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ.2 లక్షల సాయం అందించడంతోపాటు సబ్సిడీ కూడా ఇస్తుంది. దీనికోసం సమీపంలోని బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలను సమర్పించాలి. అనంతరం మీ వివరాలను బ్యాంకు అధికారులు పరిశీలించి రూ.2లక్షలు మంజూరు చేస్తారు.