ఖేలో ఇండియా గేమ్స్‌-2026కు హైదరాబాద్ ఆతిథ్యం

72చూసినవారు
ఖేలో ఇండియా గేమ్స్‌-2026కు హైదరాబాద్ ఆతిథ్యం
ఖేలో ఇండియా గేమ్స్‌-2026కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. 2025 ఏడాదే ఈ క్రీడ‌ల‌ను హైద‌రాబాద్ వేదిక‌గా నిర్వ‌హించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి చేశారు. కాగా, 2025 క్రీడ‌ల‌ను బీహార్‌లో నిర్వహించాలని అప్పటికే నిర్ణయం జ‌రిగిపోయింది. ఈ నేప‌థ్యంలో 2026 క్రీడ‌ల‌ను భాగ్య‌న‌గ‌రంలో నిర్వ‌హించేందుకు కేంద్రం అంగీకరించింది. గచ్చిబౌలి, సరూర్ నగర్, జింఖానా, ఉస్మానియా క్యాంపస్‌లలో పోటీలు నిర్వహించనున్నారు.
Job Suitcase

Jobs near you