భారత్ 2036 ఒలింపిక్స్ నిర్వహణపై ఆసక్తి ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన ఆసక్తిని వెల్లడిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి లేఖను సమర్పించింది. అహ్మదాబాద్‌లో ఈ విశ్వ క్రీడలను నిర్వహించాలన్నది ఆలోచన. అయితే ఒకవేళ బిడ్ గెలిస్తే ఒక్క అహ్మదాబాద్‌లోనే కాకుండా దేశంలోని వివిధ నగరాల్లో పోటీలను నిర్వహించడంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఉన్న క్రీడా సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్నది ఉద్దేశం.