భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఓడరేవుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈనేపథ్యంలో ఒడిశాలోని పరదీప్ పోర్టుకు వచ్చిన ఓ షిప్ కలకలం రేపింది. అందులో 21 మంది పాక్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బుధవారం దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా ఓ నౌక పరదీప్ పోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో ఓడరేవు ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.