ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించాలని చూసే చైనా కొన్ని దేశాలకు గుడ్ న్యూస్ చెప్పింది భయ్యా. వీసా ఫ్రీ పాలసీని తీసుకువచ్చింది. 240 గంటల ట్రాన్సిట్ వీసా ఫ్రీ పాలసీని 55 దేశాలకు విస్తరించింది. ఇండోనేసియా, బ్రిటన్, రష్యా వంటి దేశాల పౌరులు చైనాలో పర్యాటకం లేదా వ్యాపార నిమిత్తం వీసా లేకుండా 10 రోజుల వరకు ఉండవచ్చు. గురువారం నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని చైనా మీడియా పేర్కొంది.