రామ్‌చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడలో ఇప్పటికే భారీ కటౌట్ సిద్ధం చేశారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి అని.. రామ్‌చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చరణ్ అభిమానులు తెలిపారు.