27 కిలోల బంగారం.. 601 కిలోల వెండి..10వేల చీరలు.. 750 జతల పాదరక్షలు ఎవరివీ అనుకుంటున్నారా? తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆస్తులు. 2004లో ఆమెపై అక్రమార్జనకు సంబంధించి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరు కోర్టు విచారణ చేపట్టి అప్పుడు స్వాధీనం చేసుకున్న ఆస్తులను తాజాగా తమిళనాడు ప్రభుత్వానికి వాటిని అందజేసింది. ఆరు ట్రంకు పెట్టెలలో వీటిని తమిళనాడుకు తరలించారు. వీటి విలువ రూ.4వేల కోట్లు ఉంటుందని తెలిపారు.