తెలంగాణలో బుధవారం జరిగిన ఇంటర్ సెకండియర్ పరీక్ష ప్రశ్నపత్రాల్లో మూడు తప్పులు దొర్లాయి. వృక్షశాస్త్రం (తెలుగు లాంగ్వేజ్)లో 5వ ప్రశ్నలో నత్రజని క్షారాల బదులు ఎన్ పునాదికి అని, 7వ ప్రశ్నలో స్లాస్టిడ్లుకు బదులు ప్లాసిడ్లకు అని వచ్చింది. మ్యాథ్స్ 2ఏ (తెలుగు లాంగ్వేజ్)లో సమాసం ధనాత్మకం బదులు సమీపం రూఢి అని ప్రింట్ అయింది. వాటిని సవరించుకోవాలని ఇంటర్‌బోర్డు అధికారులు అన్ని పరీక్షా కేంద్రాలకు సమాచారం ఇచ్చారు.