సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తీర్పునిచ్చింది. ఏదైనా జాప్యం జరిగితే కారణాలను రాష్ట్రాలకు వివరించాలని పేర్కొంది. తమిళనాడుకు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ RN రవి ఆపి ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. గడువులోగా గవర్నర్ చర్య తీసుకోకుంటే జ్యుడిషియల్ స్క్రూటినీని ఎదుర్కోవలిసి వస్తుందని హెచ్చరించింది.