మహారాష్ట్ర ప్రజలను గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా అక్కడ మరో మూడు GBS కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 183కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 151 మంది కోలుకోగా, ఆరుగురు మరణించారు. ఇటీవల ముంబైలో 64 ఏళ్ల వృద్ధురాలికి GBS వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.