TG: రాష్ట్రంలో మూడు శాసనమండలి ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం మూడు నామపత్రాలు దాఖలు అయ్యాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వేముల కరుణాకర్ రెడ్డి, పొడిశెట్టి రాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి తిరుమల్‌రెడ్డి, ఇన్నారెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి రెండో రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ మూడు నియోజకవర్గాలకు రెండు రోజులకు కలిపి మొత్తం 13 నామినేషన్లు వచ్చాయి.