కర్రెగుట్టలో 20 రోజులపాటు సాగిన ఎదురుకాల్పులకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 20 రోజుల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారని వెల్లడించారు. కూంబింగ్‌లో భాగంగా 18 మంది జవాన్లు గాయపడ్డారని చెప్పారు. కర్రెగుట్టలో 214 బంకర్లు గుర్తించి.. ధ్వంసం చేసినట్లు తెలిపారు. బంకర్లలో పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.