ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోలు చనిపోయారు: IG సుందర్ రాజ్

59చూసినవారు
ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోలు చనిపోయారు: IG సుందర్ రాజ్
ఛత్తీస్‎గఢ్‎లో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఏరియా ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 31 మంది మృతిచెందగా, ఇద్దరు జవాన్లు చనిపోయారని తెలిపారు. మావోయిస్టుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్