క్షిపణి దాడిలో 31 మంది మృతి

78చూసినవారు
క్షిపణి దాడిలో 31 మంది మృతి
ఉక్రెయిన్‌లో సుమీ నగరంపై రష్యా సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో 31 మంది మృతి చెందారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని, 84 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారన్నారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకుండా రష్యా దాడులను ఖండించాలని జెలెన్ స్కీ కోరారు. రష్యాపై బలమైన ఒత్తిడి తీసుకురాకపోతే ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్