హైదరాబాద్ గాంధీభవన్ వద్ద 317 జీవో బాధితులు నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జీవో రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న బాధితులతో మంత్రులు అక్కడే చర్చలు జరుపుతున్నారు. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చర్చల్లో పాల్గొన్నారు. ఈ జీవోతో పడుతున్న ఇబ్బందులను ఆందోళనకారులు మంత్రులకు వివరిస్తున్నారు.