కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు 'నారీ శక్తి వందన్ అధినియమ్'కు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాగా 2029 లోక్‌సభ ఎన్నికల్లో అమలు చేసేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. జనగణన, డీలిమిటేషన్ తర్వాత అమల్లోకి రానున్నాయి. కాగా 2027లో దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టనున్నారు.