హెపటైటిస్‌తో రోజుకు 3500 మరణాలు: WHO

577చూసినవారు
హెపటైటిస్‌తో రోజుకు 3500 మరణాలు: WHO
హెపటైటిస్ వైరస్ పై WHO ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వైరస్ వల్ల రోజుకు 3,500 మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. హెపటైటిస్ మరణాల సంఖ్య 2019లో 1.1 మిలియన్లుగా ఉండగా, 2022లో 1.3 మిలియన్లకు పెరిగిందని తెలిపింది. మొత్తం హెపటైటిస్ కేసుల్లో మూడింట రెండొంతులు బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, వియత్నాంలో నమోదవుతున్నట్లు WHO తన నివేదికలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్