తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మరో 1500 అదనంగా ఇండ్లకు జాబితా తయారు చేయాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు. 'గత ప్రభుత్వం మాదిరిగా మా ప్రభుత్వం మాయ మాటలు చెప్పదు. మేము అధికారంలోకి రాగానే ఇళ్ల పట్టా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకే ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చాం' అని తెలిపారు.