TG: కాంగ్రెస్ పాలనతోనే పేదల కలలు సాకారం అవుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఆయన పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రూ.22,500 కోట్లతో తొలి ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుకుకపడ్డారు. BRS సర్కార్ పేదలకు ఇళ్లు ఇస్తామని పబ్బం గడుపుకుందని భట్టి విమర్శించారు.