ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా వైభవంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే నది సంగమం వద్ద 40 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల ప్రధాని మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే ప్రపంచం నలుమూలల నుంచి వందలాది మంది ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26 నాటికి మహా కుంభమేళా ముగియనుంది.