తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తామని BRS నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీసీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్‌పై తీర్మానం కాదు.. చట్టబద్ధత కల్పించాలన్నారు. కాంగ్రెస్ పాలనలోనే BC, SC, ST, మైనార్టీలు అణచివేయబడ్డారని విమర్శించారు.