నిజామాబాద్ జిల్లా హోన్నజీపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. కలుషిత నీరు తాగి 44 గొర్రెలు మృతి చెందాయి. రాజయ్య అనే రైతు గొర్రెలను మేపేందుకు పొలానికి తీసుకెళ్లారు. అయితే అదే సమయంలో పొలానికి ఓ రైతు క్రిమిసంహారక మందు కొట్టించాడు. దీంతో క్రిమిసంహారక మందు నీళ్లలో కలిసింది. ఆ నీరు తాగడంతో దాదాపు 44 గొర్రెలు మృతి మరణించాయి. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.