జమ్మూకశ్మీర్‌లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 గా తీవ్రత నమోదైంది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గురువారం సాయంత్రం 4.19 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.