మహాకుంభమేళాకు ఇప్పటివరకు 50 కోట్ల మంది

77చూసినవారు
మహాకుంభమేళాకు ఇప్పటివరకు 50 కోట్ల మంది
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో భక్తుల రద్దీ ఇప్పటికి కొనసాగుతోంది. అయితే శుక్రవారం సాయంత్రానికి 50 కోట్ల మంది జనాభా పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం అంచనాలకు మించి భక్తులు వచ్చినట్లు సమాచారం. కాగా ఇటీవల ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న పుణ్యస్నానాలు ముగియనున్నాయి.

సంబంధిత పోస్ట్