TG: హైదరాబాద్ నగరంలో దీపావళి వేడుకల్లో పలు చోట్ల టపాసులు కాలుస్తూ కంటికి గాయాలైన ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో బాధితులంతా సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి బారులు తీరారు. ఇప్పటి వరకు 50 మంది బాధితులు గాయాలతో ఆసుపత్రికి చేరుకున్నారు. ఇందులో 9 మందికి సీరియస్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా 34 మందికి స్పల్ప గాయాలయ్యాయని తెలిపారు.