AP: భవిష్యత్ లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 'ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లలో క్యూఆర్ కోడ్ ఉంచాలి. అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. నిత్యావసర సరుకుల ధరలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నా వాటిని విస్మరించవద్దు" అని ఆయన అన్నారు