హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం ప్రజా భవన్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పొన్నం పాల్గొన్నారు. ‘మహిళలకు 5వేల ఈవీ ఆటోలు ఇచ్చే యోచన ఉంది. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది. ప్రజలకు మెరుగైన రవాణా సేవలందించేందుకు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చేస్తోన్న కృషి అభినందనీయం’ అని అన్నారు.