ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గడువును IBPS ఈ నెల 28 వరకు పొడిగించింది. వీటిలో 4,455 PO/మేనేజ్‌మెంట్ ట్రైనీస్ పోస్టులు, 896 SO జాబ్స్ ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ పూర్తైన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో చూడగలరు.