ఆఫ్ఘనిస్తాన్ హిందూకుష్ ప్రాంతంలో బుధవారం ఉదయం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి 121 కిలోమీటర్ల లోతులో ఇది నమోదైందని యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఢిల్లీ, పాకిస్తాన్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. ప్రస్తుతం ఆస్తినష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియవు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.