ప్రైమ్ వీడియోలో గంటకు 6 నిమిషాల యాడ్స్

81చూసినవారు
ప్రైమ్ వీడియోలో గంటకు 6 నిమిషాల యాడ్స్
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. జూన్ 17 నుంచి సినిమాలు, వెబ్‌సిరీస్‌లు యాడ్స్‌తో ప్రసారం కానున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ప్రతి గంటకు ఆరు నిమిషాల యాడ్స్ వస్తాయని తెలిపింది. ప్రకటనలతో కంటెంట్ చూడటానికి అభ్యంతరం లేనివారు ప్రస్తుత ప్లాన్‌తో కొనసాగవచ్చు. ప్రకటనలు లేకుండా చూడాలనుకునేవారు నెలవారీగా రూ.129 లేదా ఏడాదికి రూ.699 అదనపు రుసుముతో ప్లాన్ వేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్