ఇతర దేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో గత ఐదేళ్లలో ఇప్పటివరకు 633 మంది మరణించారని కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా కెనడాలో 172 మంది మృతి చెందినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో తాజాగా తెలిపారు. యూకేలో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్‌లో ఒకరు చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.