ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అవార్డుల హడావుడి ప్రారంభమైంది. 97వ అకాడమీ అవార్డ్స్ కోసం నామినేషన్ ఓటింగ్ ప్రాసెస్ 2025 జనవరి 8 నుంచి 12వ తేదీ వరకు జరుగుతుంది. ఫైనల్ నామినీలను జనవరి 17న ప్రకటిస్తారు. ఈ రేసుకి ఎంపికైన 323 సినిమాల్లో 7 ఇండియన్ మూవీస్ ఉన్నాయి. ఈ లిస్టులో సూర్య కంగువ, ఆడుజీవితం, పుతుల్, సంతోష్, స్వాతంత్ర్య వీర్ సావర్కర్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, గర్ల్స్ విల్ బి గర్ల్స్ సినిమాలు ఉన్నాయి.