గతేడాది విమానాలకు 728 బాంబు బెదిరింపులు

50చూసినవారు
గతేడాది విమానాలకు 728 బాంబు బెదిరింపులు
దేశంలో గతేడాది విమానాలకు సంబంధించి మొత్తం 728 బాంబు బెదిరింపులు వచ్చినట్టు కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్‌ మొహోల్‌ వెల్లడించారు. వాటిలో 714 బెదిరింపులు దేశీయ విమానయాన సంస్థలకు, మిగతావి విదేశీ సంస్థలకు వచ్చినట్టు తెలిపారు. ఆయా ఘటనల్లో మొత్తం 13 మందిని అరెస్టు చేశామన్నారు. మిగతావి ఫేక్ బెదిరింపులు అని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్