సంక్రాంతి సందర్భంగా జనవరి 13, 14, 15వ తేదీల్లో HYD-సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే 7వ అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ కోసం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ క్లబ్ సభ్యులు పాల్గొని వివిధ డిజైన్ల పతంగులను ఎగురవేస్తారని తెలిపారు.