తెలంగాణలో 8 బీజేపీ ఎంపీలు + 8 కాంగ్రెస్ ఎంపీలు = 0 మోడల్ సక్సెస్ అయ్యిందని BRS MLC కవిత ఎద్దేవా చేశారు. 'పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు జాతీయ హోదా నిరాకరించడం రాష్ట్రంపై BJP ప్రభుత్వం చూపుతున్న మరో వివక్ష. అన్యాయమైన బడ్జెట్ కేటాయింపులు, ప్రాజెక్ట్ గుర్తింపులు, మన సంస్కృతి, పండుగలను పూర్తిగా విస్మరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరించడమనేది పురాతన చరిత్రలో సరికొత్త అధ్యాయం' అని విమర్శించారు.