తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక నిన్న శ్రీవారిని 75,109 మంది భక్తులు దర్శించుకోగా, 30,285 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.