వింత వ్యాధితో 8 మంది మృతి

66చూసినవారు
వింత వ్యాధితో 8 మంది మృతి
వింత వ్యాధి ప్రజలను భయపెడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఈ మిస్టీరియల్ రోగంతో ఒకే గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ వ్యాధి ఏమిటో? ఎలా వస్తుందో తెలియదు. రోగులను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నా చనిపోతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం బీఎస్ఎల్-3 మొబైల్ లేబొరేటరీని అక్కడికి పంపించింది. దీనిపై వైద్యులు పరిశోధిస్తున్నారు.
Job Suitcase

Jobs near you