TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు అందిస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తుందన్నారు. ఇంటి నిర్మాణాన్ని 400- 600 చదరపు అడుగులలోపే నిర్మించుకోవాలని చెప్పారు. ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోతే మహిళా సంఘాల నుండి లక్ష రూపాయల రుణం పొందవచ్చన్నారు.