దేశవ్యాప్తంగా ఉన్న రీజియన్లలో సుమారు 8,113 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ రైలు మేనేజర్, స్టేషన్ మాస్టర్, జూ. అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పొందిన వారు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 13-10-2024. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/.