రైల్వేలో 8,113 (గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్–1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్–994, సీనియర్ క్లర్క్–732) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ 20వ తేదీతో ముగియనుంది. డిగ్రీ అర్హతతో 18–36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేయవచ్చు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. SCRలో 478, ECoRలో 758 పోస్టులున్నాయి. ఫీజు: రూ.500 (ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్). పూర్తి వివరాలను అభ్యర్థులు ఆర్ఆర్‌బి అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.