యూపీలో పిడుగుపాటుకు 9 మంది మృతి.. సీఎం కీలక ఆదేశాలు

82చూసినవారు
యూపీలో పిడుగుపాటుకు 9 మంది మృతి.. సీఎం కీలక ఆదేశాలు
యూపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు గురై 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్‌రాజ్‌లోని సోన్‌వర్ష హల్లాబర్ గ్రామంలో శనివారం పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. పిడుగుపాటు, వరదల కారణంగా జరిగిన ప్రాణనష్టంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి వైద్య సహాయం, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్