అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా లాంఛనంగా ఖరారయ్యారు. ఆమెకు అనుకూలంగా 99 శాతం మంది పార్టీ ప్రతినిధుల ఓట్లు లభించాయి. దేశవ్యాప్తంగా సుమారు 4,567 మంది హారిస్‌ను బలపరుస్తూ ఓటేశారు. ఇదిలా ఉండగా హారిస్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాజ్ (60)ను మంగళవారం ఎంపిక చేసుకున్నారు.