మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఆదివారం దారుణ ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలికపై ట్రక్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తన స్నేహితులతో కలిసి వందేవి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ ట్రక్ డ్రైవర్, యువకులను బెదిరించి.. బాలికను అడవిలోకి ఎత్తుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి డ్రైవర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.