బెంగళూరులోని నేలమంగళలో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నేలమంగళ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయకుండా నోటిలో గుడ్డ బిగించి వృద్ధుడు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అత్యాచారానికి గురైన వృద్ధుడిని కొట్టి పోలీసులకు అప్పగించారు.