TG: మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుందరీమణులు మాట్లాడుతూ.. హైదరాబాద్ అతిథ్యం తమనుతమను మురిపిస్తోందని, ఇదో మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదం తమ దేశాల్లో కూడా వినిపిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమానికి నాగార్జున కూడా హాజరయ్యారు.