ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల పులులు, తోడేళ్లు ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట పొలాలు, గ్రామాల్లోకి ప్రవేశిస్తూ జనంపై దాడులు చేస్తున్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా, ఇటీవల పలు తోడేళ్లు, పులులను అటవీ శాఖాధికారులు బంధించారు. అయితే, తాజాగా ఫిలిబిత్‌లోని ఓ గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కొందరు పంట పొలాల గుండా వస్తుండగా వారికి పులి కనిపించింది. దీంతో ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు.